కేసులకు భయపడేది లేదు : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

-

కేసులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని రండ అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తిట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసులు పెట్టారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. ఇక తాజాగా బాల్క సుమన్‌ కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు.

Notices to Balka Suman

కేసులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారన్నారు. ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇవ్వడం జరిగిందని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version