తమ పాలనలో లేని ట్యాంకర్లు, బిందెలు ఇప్పుడు ఎందుకు బయటికొచ్చాయంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రూపాయికే నల్లా కనెక్షన్, ఫ్రీ వాటర్ ఇచ్చాం. 35వేల కోట్లు ఖర్చు పెట్టి వద్యుత్ రంగాన్ని బాగు చేశాం. 24 గంటలు కరెంట్ ఇచ్చాం. స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అధికార పార్టీ అవివేకం, తెలివితక్కువతనం, అవగాహనరాహిత్యం క్లియర్ గా కనిపిస్తోంది. ఉన్న కరెంట్ ను మిషన్ భగీరథను వాడే తెలివి లేదని మండిపడ్డారు.
మేము హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీ మగా మార్చాం. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయిందని ప్రశ్నించారు. రాజకీయాలు చేసే తీరిక ఉంది.. కానీ కరెంట్, వాటర్ ఇచ్చే తీరిక లేదు. జూన్ వరకు వర్షాలు రావు.. అప్పటి వరకు వర్షాలు రాకుంటే రైతుల పరిస్థితి ఏం కావాలి అని ప్రశ్నించారు. కుక్కల్ని నక్కల్ని గుంజుకొని సంకలు గుద్దుకుంటున్నారు. మా ఎమ్మెల్యేలను లాక్కోవడం చీఫ్ పాలిటిక్స్ అన్నారు.