పాలకుర్తిలో పైడ్రా అంటూ తాజాగా ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ లో హైడ్రా మాదిరిగా పాలకుర్తిలో పైడ్రా అంటూ చెప్పారు. ఇదిలా ఉండగానే.. తాజాగా పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయిస్తున్నారు రెవెన్యూ, పోలీస్ అధికారులు. ఓటు వేసి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డిని గెలిపిస్తే.. ఇదా ప్రతిఫలం అని విలపిస్తున్నారు కొన్ని కుటుంబాలు. జనగామ జిల్లా – పాలకుర్తి మండలం లోని తొర్రూరు (జే) గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి సీల్ వేశారు రెవెన్యూ సిబ్బంది.
గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదు అధికారులు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం, పట్టుబట్టి నిరుపేదలను ఖాళీ చేయిస్తున్నారు. ఉన్న పలంగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇండ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రి బయట పడేస్తే మేము ఎక్కడికి పోవాలని పేర్కొంటున్నారు. ఇంట్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధేయపడినా వినలేదు అధికారులు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దయ తలచి మాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. అధికారులు ఇండ్లు ఖాలీ చేయిస్తుండటంతో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు బాధితులు.