ఓల్డ్ సిటీ గడ్డ మర్డర్లు కి అడ్డా : ఎమ్మెల్యే రాజాసింగ్

-

ఓల్డ్ సిటీ గడ్డ మర్డర్లు కి అడ్డాగా మారిపోయిందని గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసులు గస్తీకి వస్తే ఎంఐఎం నేతలు వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతల కాపాడితే ఎంఐఎం నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వస్తున్న ఇబ్బంది ఏంటి..? అని ప్రశ్నించారు. గొడవలు జరుగకుండా ఉండాలంటే సీఎం రేవంత్ రెడ్డి మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.

జూన్ నెలలోనే ఎన్నో మర్డర్లు అయ్యాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ, చుట్టు పక్కల విలేజ్ లలో కానీ చాలా మర్డర్లు జరిగాయని తెలిపారు. నైట్ పూట రెండు, మూడు గంటల వరకు షాపులు, హోటల్స్ ఓపెన్ చేస్తున్నారు. దానికి కంట్రోల్ చేయడానికి.. ఈ మర్డర్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు వాళ్ల స్థాయిలో పని చేస్తున్నారు. ఇంకొక వైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news