రేషన్ కార్డు ఉంటేనే..6 గ్యారంటీలు : సీఎం రేవంత్ రెడ్డి

-

సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తు ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యం.. తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తాం. పదేళ్లు ప్రభుత్వం – ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుంది.

ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చు.. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వండి.. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చు.. ఎవరి కోసం ఎదురు చూడంకండి.. ఎవరి దగ్గరకు పోకండి.. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది.. అధికారులు ప్రజలను రప్పించుకోవడం కాదు.. వాళ్ల దగ్గరకే అధికారులు పోవాలి అన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు వర్తిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version