‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల అప్పుడేనా..?

-

దసరా’  విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హాయ్ నాన్న పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. డిసెంబర్ 21న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేసి.. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ గాల చార్ట్ బస్టర్ నెంబర్ ‘సమయమా’ తో ప్రారంభమైయింది. ఈ పాట లీడ్ పెయిర్ -నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని చూపించింది.

ఇప్పుడు సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్‌ ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘గాజు బొమ్మ’ అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ క్యూట్ వీడియోని నాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో నాని, కియారా ఖన్నా ముచ్చటగా మాట్లాడుకుంటూ.. గాజు బొమ్మ పాటను అనౌన్స్ చేశారు. ‘లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్.. మరి మన సాంగ్ ? అని బేబీ కియారా నానిని అడుగుతుంది. నాని పాపని గాజు బొమ్మ అని పిలుస్తాడు. తండ్రి కూతురు నేపధ్యంలోని ఈ పాట ‘హాయ్ నాన్న’ సోల్‌గా ఉండబోతోందని తెలుస్తుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version