BRS ఎమ్మెల్యే షకీల్‌ను ఓడించటమే మా లక్ష్యం అంటూ నిజామాబాద్ జిల్లా పర్యటనలో అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. BRS ఎమ్మెల్యే షకీల్‌ను ఓడించటమే మా లక్ష్యమని.. బోదన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుందని కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు ఓవైసీ.
వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. బోదన్‌లో ఎంఐఎం నాయకులపై కేసులు పెట్టడం అమానుషం అని ఆగ్రహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు, అరెస్ట్ అయిన మా నాయకులు రాత్రింబవళ్లు పని చేశారని… అయినా మా వాళ్లను అరెస్ట్ చేశారని నిప్పులు చెరిగారు అసదుద్దీన్ ఓవైసీ. బాలికపై జరిగిన అత్యాచారానికి వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ…ముస్లింలకు ముస్లిం బంధు ఇవ్వాలని కోరారు.