నేడు దిల్లీలో ‘తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహ సమావేశం’

-

తెలంగాణలో పూర్వ వైభవం దక్కించుకోవడమే గాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ దృఢంగా సంకల్పించిన విషయం తెలిసిందే. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. ముందుగా ఆపరేషన్ ఆకర్ష్.. ఘర్ వాపసీలతో కీలక నేతలను పార్టీలో చేర్చుకుని క్యాడర్​ను బలపర్చుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర బీఆర్ఎస్ నేతలను హస్తం పార్టీ చేర్చుకుంది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహ సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, మల్లు రవి తదితరులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news