బీడీలు అమ్ముకునే దానం నాగేందర్..సిగ్గుంటే రాజీనామా చేయ్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ విలీనం కాబోతుందని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. పంజాగుట్ట చౌరస్తాలో దానం నాగేందర్ బీడీలు అమ్ముకునే వాడని రేవంత్ రెడ్డే చెప్పాడని గుర్తు చేశారు.
బీడీలు అమ్ముకునే నువ్వు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు.. బిడ్డ నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు ఇబ్బంది పెట్టిన బాధితులు చాలా మంది నా దగ్గరికి వచ్చారని తెలిపారు. నీ అక్రమాలు కూడా త్వరలోనే బయట పెడుతామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన 9 మంది బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. గెలిచి చూపించాలని సవాల్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.