కాంగ్రెస్ పార్టీకి మరో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. BRS ఎమ్మెల్యేలు అందరం యూరిన్ శాంపిల్ డబ్బాలతో రెడీగా ఉన్నాం… ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తాము అంటూ స్పష్టం చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మీరే డేట్ ఫిక్స్ చేయండి… డబ్బాలతో రెడీగా ఉన్నాం… ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తాము అంటూ సవాల్ విసిరారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వాయిస్ ను మార్చి ఫేక్ వీడియోలు, ఆడియోల ద్వారా దుష్ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని మండి పడ్డారు. యావత్ తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.. అంటూ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర డైవర్షన్ పాలిటిక్స్ తిప్పికొడదామని స్పష్టం చేశారు. నీలాంటి తలకు మాసిన పెయింటర్ రాస్తే పోయేది కాదు.. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పేరు కేసీఆర్ అంటూ గుర్తు చేశారు.