వచ్చే నెల 3న ‘పాలమూరు-రంగారెడ్డి’ డ్రైరన్‌కు సన్నద్ధం

-

పాలమూరు ప్రజలకు శుభవార్త. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్‌ఎల్‌ఐ) ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది. ఈ ప్రాజెక్టు డ్రైరన్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి స్మితాసబర్వాల్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టు ప్యాకేజీ-1, 3లో చేపడుతున్న పనులను ఆమె సోమవారం రోజున పరిశీలించారు.

వచ్చే నెల 3న మొదటి లిఫ్ట్‌లో డ్రైరన్‌ నిర్వహిస్తామని స్మితా సబర్వాల్ వెల్లడించారు. 15వ తేదీన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను కృష్ణాజలాలతో నింపుతామని తెలిపారు. అక్టోబర్‌ 15వ తేదీన ఏదుల, నవంబర్‌ 15వ తేదీనన వట్టెం రిజర్వాయర్‌తోపాటు గ్రావిటీ కెనాల్‌ ద్వారా కరివెన రిజర్వాయర్‌కు జలాలను విడుదల చేస్తామని వెల్లడించారు.  నెల వ్యవధిలో దశల వారీగా పీఆర్‌ఎల్‌ఐలోని రిజర్వాయర్లను నింపే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయా.. అనే విషయమై అధికారులతో చర్చించామని తెలిపారు. పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టులో పంపింగ్‌ విజయవంతమవుతుందన్న నమ్మకం ఉందని స్మితా సబర్వాల్ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news