BRS కార్యకర్తలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా బలం, బలగం బీఆర్ఎస్ సైన్యమేనని ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తాజాగా జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీల సమావేశానికి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు.ఏ పార్టీకి లేనంత కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.
క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ సైనికులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమయ్యేలా ఎంతో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. పదేండ్లలోనే 60ఏండ్ల అభివృద్ధి సాధించామని, ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. మరోసారి అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. క్షేత్రస్థాయిలో మిగతా పార్టీల నేతలకు కనీసం ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉందని, అయినప్పటికీ పోలింగ్ వరకు పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు.