రూల్స్ బ్రేక్ చేసిన చంద్రబాబు నాయుడు..

-

రూల్స్ అన్నాక అందరికీ ఒకటే పేదవాడికైనా గొప్పవాడికైనా రాజకీయ నాయకుడికైనా రూల్స్ ఇచ్చినప్పుడు కోర్టు అవి అతిక్రమించకూడదు. కానీ, మన బాబు గారు అందరిలా కాదు రూల్స్ గ్రిల్స్ నాకు లేవు అన్నట్టుగా జైలు బయటకు రాగానే మైక్ తీసుకుని మాట్లాడేశారు. అసలు కోర్టు ఏం చెప్పింది అంటే మీ ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకొని మీకంటి చికిత్సకు అవసరం గుర్తించి మీకు నెల రోజుల పాటు మధ్యంతర ఇస్తున్నాము. ఈ నెల రోజులు అవ్వగానే మీరు మళ్ళీ కోర్టులో లొంగి పోవాల్సి ఉంటుంది. వీటితోపాటు మీరు సాక్షుల్ని ప్రభావం చేయకూడదు బయట ఫోన్లు మాట్లాడకూడదు అని కొన్ని కండిషన్స్ తో బయటికి పంపిస్తున్నాము అని చెప్పింది.

వాటిని అతిక్రమించకూడదని కూడా, రూల్స్ తో పాటు కొన్ని కండిషన్స్ తో పాటు ఇద్దరు పూచికత్తు మీద లక్ష రూపాయలు జరిన జరిమానా తో బాబును ముందస్తుబేలు మంజూరు చేశారు హైకోర్టు. కానీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బాబు బయటకు వస్తూనే అతిక్రమించాడు మైకు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా నేను తప్పు చేయలేదు చేయనివ్వను చెయ్యను అంటూ, నాకోసం మీరందరూ ముందుండి 52 రోజులుగా నాకోసం నిరసనలు చేస్తున్నందుకు ఇలాంటి అభిమానులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇలాంటి అనుభవం ఏ నాయకుడికి రాదు ఇలాంటి అదృష్టం ఏ రాజకీయ నాయకుడు అనుభవించలేదు. అని జైల్లో 52 రోజులు ఉండడమేమన్నా అదృష్టమా అని బయట ప్రజలు అనుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి కేసీఆర్‌కి కృతజ్ఞతలు కాంగ్రెస్ బిజెపిలో నన్ను సపోర్ట్ చేసిన నాయకులందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.

వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అంత అవసరమేముంది అందరూ ఒకటే కదా ఎప్పుడో బాబు పవన్ కళ్యాణ్ ఒకటే అన్న విషయం ఊరంతా తెలుసు ఇప్పుడు బాబుకి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఏముందని కొందరు నేతలు భావిస్తున్నారు. తనని ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమాతోనే బాబు గారు ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు. అంత అనుభవం ఉన్న నాయకుడు ఇలా చేయడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news