Breaking News : బీఆర్ఎస్ లో చేరనున్న పాల్వాయి స్రవంతి రెడ్డి..?

-

కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల పేర్లు జాబితాలో లేకపోవడంతో ఫిరాయింపులు మొదలు పెట్టారు. ఇప్పటికే కొందరు నేతలు రాజీనామా చేయగా.. మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేయాలని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ స్థానాన్ని ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కట్టబెట్టింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి ఆశపడ్డారు. కానీ వీరి ఆశలను నిర్వీర్యం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇటీవలే పాల్వాయి స్రవంతి, కైలాస్ నేత మునుగోడు కార్యకర్తలతో రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలతో చర్చించినట్లు సమాచారం. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కోమటిరెడ్డి రాక ను జీర్ణించుకోలేకపోతున్నామని మండిపడ్డారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. త్వరాలోనే బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేళ పాల్వాయి స్రవంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version