హైఅల‌ర్డ్‌.. ఉద్యోగులకు సెలవులు రద్దు

-

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌-విశాఖపట్నం మధ్యలో తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రస్తుతం పూర్తిగా భూభాగంపైకి వచ్చింది. దీని ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో రానున్న ఐదారు గంటల్లో ఏపీలోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

కాగా భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఏపీలోని పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని భారీ వర్షాలపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆమె అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ప‌రిస్థితిపై సమీక్షించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్‌ ఆదేశించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గిరిజా శంకర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news