BREAKING: కాంగ్రెస్ పార్టీలోకి పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ?

-

Patan Cheru BRS MLA Mahipal Reddy: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని కలిశారు పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. హైదరాబాద్ లోని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.

Patan Cheru BRS MLA Mahipal Reddy meets Health Minister Damodara Rajanarsimha

తెల్లాపూర్ లో ఈ నెల 20న మున్సిపల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం, గద్దర్ ఆడిటోరియం శంకుస్థాపనకు రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి ఆహ్వానం అందించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో BRS ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మానిక్ రావులతో కలిసి సీఎంని కలిశారు మహిపాల్ రెడ్డి. కేవలం అభివృద్ధి పనుల కోసమే కలిశానని చెబుతున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కానీ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు వచ్చినట్లు కొంత మంది ప్రచారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version