సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి..బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే..దీనిపై పటేల్ రమేష్ రెడ్డి..తాజాగా క్లారిటీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పటేల్ రమేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
నేను పార్టీ మారుతున్న అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు పటేల్ రమేష్ రెడ్డి. తన ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. నాపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తనపై తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఐసీసీ పీసీసీ నాయకులు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని వివరించారు పటేల్ రమేష్ రెడ్డి.