నా ఫామ్ హౌజ్ రూల్స్ ప్రకారమే ఉంది…ఎవరూ కూల్చలేరు – మహేందర్ రెడ్డి

-

కేటీఆర్, హరీష్, ఇంద్రారెడ్డికి చెప్పేది ఒకటే.. నా ఫామ్ హౌజ్ రూల్స్ ప్రకారం ఉన్నదని పట్నం మహేందర్ రెడ్డి ప్రకటించారు. రూల్ ప్రకారం లేదంటే నేనే దగ్గర ఉండి కూల్చివేస్తానని కూడా తెలిపారు. ప్రతీ సారి నా పేరు తీసుకుని విమర్శలు చేస్తున్నారు. నేను మంత్రిగా పని చేసిన.. భాద్యత ఉన్న వ్యక్తిని అని వివరించారు. నిబంధనల మేరకే ఫామ్ హౌజ్ ఉందని అధికారులు నాకు నివేదిక ఇచ్చారు.

patnam mahender reddy farm house

Ftl, బఫర్ జోన్ లో నా ఫామ్ హౌజ్ నిర్మాణం చేయలేదని వివరించారు. రింగ్ రోడ్డు మీద నుంచి చూస్తే గుట్టల మీద ఉంటది. నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. నా ఫామ్ హౌజ్ 20 ఏళ్ల క్రితం కట్టామని పేర్కొన్నారు. 111 జీవో సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని వెల్లడించారు. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు….కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ కు పర్మిషన్ ఉందా? లేదా నాకు తెలియదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫామ్ ఉంటే కూల్చి వేయాల్సిందేనని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి నా ఫామ్ హౌజ్ పక్కనే ఫామ్ హౌజ్ లు ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news