పోలీస్ కేసుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూ విక్రయాలకు సంబందించి మధ్యాహ్నం నుండి మీడియా మాద్యమాలలో తన పై వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవ మని వాటిని ఖండిస్తున్నట్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.వార్త కథనాల పై స్పందించిన ఎమ్మెల్యే పట్నం కొడంగల్ పురపాలక కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఉప్పర్ పల్లి పరిధిలో తనకు గజం భూమి కూడ లేకున్న తాను ఇంద్ర పాల్ రెడ్డి కి భూమి ఎలా విక్రయిస్తానని, విక్రయిస్తే అగ్రిమెంట్ పేపర్ లు చూయించాలని లేనిచో తన పరువు కు నష్టం కల్గించిన సదర్ వ్యక్తి పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యేలా కోర్టు కు ఈడుస్థానని ఎమ్మెల్యే హెచ్చరించాడు.
ఇంద్ర పాల్ ఒక చీటర్ అని… తనకు మూడున్నర కోట్లు ఎప్పుడు ఎక్కడ ఇచ్చాడో మీడియా ద్వారా నిరూపించాలని లేనిచో చట్ట పర చర్యలు తప్ప వని తీవ్రంగా ఎమ్మెల్యే హెచ్చరించాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన పరువు కు భంగం కలిగేలా కాంగ్రెస్ పన్నిన కుట్ర లో భాగమే ఈ భూ విక్రయ డ్రామా అని ఎమ్మెల్యే ఆరోపించాడు. ఏదీ ఏమైనా మీడియా సోదరులు సైతం ఇలాంటి కథనాలు ప్రసారం చేసే ముందు సంబందించిత వ్యక్తి వివరణ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.