తెలంగాణ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్ పెట్టారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణ పోలీస్ నియామకాల్లో తప్పులపై చర్యలు తీసుకోవాలి. నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. కీ విడుదలైనప్పుడే అభ్యంతరాలు చెప్పినా… ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. అభ్యర్థులకు న్యాయం చేయాలి. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు కూడా విలువైనది’ అని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇది ఇలా ఉండగా, తూర్పు కాపుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనే.. తూర్పు కాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతున్నారన్నారు పవన్ కల్యాణ్. కానీ, 45 లక్షల మంది తూర్పు కాపులున్నారని వివరించారు. ఏ ప్రాతిపదికన వైసీపీ 16 లక్షలని చెబుతోంది.. పథకాలు అందకుండా చేయడానికి వైసీపీ అలా అంటోంది.. జనసేన అధికారంలోకి వస్తే, తూర్పుకాపుల జనగణన చేపడతాం.. అందరికీ న్యాయం జరిగితే, కులాలతో సంబంధం లేదు.. చట్టం పనిచేయనప్పుడు కులాల వైపు చూస్తామన్నారు పవన్ కళ్యాణ్.