గులాబీ తోటలో కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అంటూ ఫైర్ అయ్యారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కడియం శ్రీహరి పార్టీ మార్పు పైన హన్మకొండ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీలో గత నెల రోజులు జరుగుతున్న పరిణామాలకు కడియం శ్రీహరి నే బాధ్యుడన్నారు.
టిఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి ఒక్కసారి కూడా ఖాళీగా లేరు….కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రి చేసేందుకు ఉప ఎన్నికలను కూడా తీసుకొచ్చి నీ గెలుపు కోసం పార్టీ మొత్తం పని చేసిందన్నారు. ఎప్పుడు విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి… నీ కూతురు కోసం విలువలను పక్కకు పెట్టరా..అంటూ నిలదీశారు. మరో సారి విలువల గురించి మాట్లాడవద్దన్నారు.
రేపు స్టేషన్ ఘనపూర్ కార్యకర్తల సమావేశం పెడుతున్నాం.. మీ బలం ఏంటో తెలుస్తుంది.. స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలు అందరూ కేసీఆర్ తోనే ఉన్నారన్నారు. అన్ని పదవులు అనుభవంచిన మీరు సీఎం పదవి ఒక్కటే చేయలేదు ఆ పదవి కోసం ఇలా చేశారా అంటూ నిలదీశారు.