ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది – చిరంజీవి

-

ప్రజారాజ్యం.. పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని వివరించారు. ప్రజారాజ్యంకు పని చేసిన నేతలందరూ ఇప్పుడు జనసేనకు పని చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో విశ్వక్సేన్ తండ్రి తన పార్టీ కోసం పనిచేసినట్లు వెల్లడించారు చిరంజీవి. తాజాగా విశ్వక్సేన్ నటించిన లైలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. అల్లు అర్జున్ నటించిన… పుష్ప 2 సినిమా విజయం పైన మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

chiranjeevi about prajarajyam janasena

చిత్ర పరిశ్రమలో వేర్వేరు కాంపౌండ్లు అనేవి లేవని ఆయన వివరించారు. ఎవరు హిట్టు కొట్టిన వాళ్లను అభినందించాల్సిందేనని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. విశ్వక్, బాలకృష్ణ అలాగే తారక్…. చాలా మాట్లాడతారు… అతడు ఈ వెంట్రుక నేను వెళ్లడమేంటని కొందరు మాట్లాడుకుంటున్నారు… మనిషన్నాక వేరే వాళ్ళ పై అభిమానం ఉండకూడదా అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. ఏ సినిమా సక్సెస్ అయిన అందరూ గర్వపడాలి అని వివరించారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 హిట్ కావడం తనకు ఎంతో గర్వకారణమని… చెప్పుకోచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version