సెబీపై కేసీఆర్ విధానం ఏంటో ప్రజలకు చెప్పాలి : సీఎం రేవంత్ రెడ్డి

-

ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన చేపడుతోంది.  ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. పేదలకు చెందాల్సింది.. కేవలం ఇద్దరూ వ్యక్తుల చేతుల్లో ఉంది. అదానీ మెగా కుంభకోణం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని మోడీ అప్పుల ఊబీలో ముంచారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు రూ.55లక్షల కోట్లు. ప్రస్తుతం దేశం అప్పుచ కోటీ రూ.55లక్షల కోట్లు. ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

నాలుగు రోజుల ముందుగానే పార్లమెంట్ వాయిదా వేశారు. మోడీ, అమిత్ షా దేశాన్ని ముంచేస్తున్నారు. సెబీపై కేసీఆర్ విధానం ఏంటో ప్రజలకు చెప్పాలి. రాజీవ్ విగ్రహం తీసేస్తాం.. ఎయిర్ ఫోర్టు పేరు మారుస్తాం. బీజేపీని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదు. ట్విట్టర్ లో ప్రతి చిల్లర విషయానికి స్పందించే కేటీఆర్ జేపీసీ విధానం పై ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news