పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ అవిశ్వాసం నెగ్గాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు తలొగ్గకపోవడంతో దాడి చేసేందుకు యత్నించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధీర్ రెడ్డి.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడ ఆగితే అక్కడ బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిపై, కార్పొరేటర్లపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో భయబ్రాంతులకు గురవుతున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు కాంగ్రెస్ నాయకులు. 25 కార్లలో వచ్చిన కాంగ్రెస్ నాయకులు, యాభై మందికి పైగా సుఫారీగుండాలు ఔటర్ పై గంటన్నర సేపు జక్క వెంకట్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారును వెంబడించారు కాంగ్రెస్ నాయకులు.