BRS లోకి పిజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. జూబ్లీహిల్స్‌ కు చెందిన కీలక నేత బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పిజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి… బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. నిన్న ప్రగతి భవన్‌ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి.

PJR’s son Vishnuvardhan Reddy into BRS

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల వ్యవహారం..బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది. రెండు లేదా మూడు రోజుల్లోనే… మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి..సీఎం కేసీఆర్‌ సమక్షంలో.. బీఆర్‌ఎస్‌ లో చేరే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం నుంచి బరిలో ఉండాలని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్‌ టికెట్ అజారుద్దీన్‌ కు దక్కింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌ కూడా ఇప్పటికే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news