తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ.. పాలమూరు సభలో మోదీ వరాలు

-

తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ సమీపంలోని అమిస్తాపూర్‌ వద్ద ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. “ములుగు కేంద్రంగా కేంద్రం ఆధ్వర్యంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నాం. గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క-సారక్క పేరుతో ఈ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి రూ.900 కోట్లు వెచ్చించనున్నాం. అని మోదీ పాలమూరు సభలో ప్రకటించారు.

‘పాలమూరు ప్రజలందరికీ నా నమస్కారాలు’ అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. పలుమార్లు నా కుటుంబ సభ్యుల్లారా? అని తెలుగులో మాట్లాడారు. ‘మీరు చూపిన ప్రేమకు ముగ్ధుడినయ్యాను. నాపై తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమ, అభిమానాన్ని చాటారు’ అని అన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతో సాధ్యమని.. తమ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news