అంగన్వాడి టీచర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. అంగన్వాడి టీచర్లు మరియు సహాయకుల మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు రోజుల్లో ఖాతాలలో జమ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో 70000 మంది అంగన్వాడి ఉద్యోగులకు లాభం చేకూరుతుందని తెలిపారు.

అటు అంగన్వాడి సిబ్బందిని పిఆర్సి లో చేర్చడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల వేతనాల పెంపు సమయంలో జీతాలు పెంచుతామని ఆయన ప్రకటించారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించే పిఆర్సి లో అంగన్వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమ్మెలో ఉన్న అంగన్వాడీల మెజారిటీ సమస్యలను తీర్చామని తెలిపారు.మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్పారు. మిగతా డిమాండ్లపై నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.