మీ ఆశీర్వాదం వృథా కానివ్వను.. ఇది నా గ్యారంటీ : ప్రధాని మోదీ

-

సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదట పటేల్‌గూడ నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అక్కడ రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రాలకు కేంద్రం సహకారంపై మాట్లాడారు. అనంతరం ఆయన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సభలో మోదీ మరోసారి తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రసంగం షురూ చేశారు.

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందిని అన్నారు. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను.. ఇది మోదీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడని అన్నారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్న ప్రధాని.. భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని పునరుద్ఘాటించారు.

“ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370 రద్దు హామీ అమలు చేశాం. అయోధ్య రామ మందిరం నిర్మించి తీరుతామని చెప్పాం. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ.” అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news