అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్‌ విమర్శిస్తోంది: ప్రధాని

-

అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్‌ విమర్శిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువన్న ఆయన వారసత్వ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. వారి అవినీతి దళాన్ని వెలికితీస్తున్నానని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము కానివ్వనన్న ప్రధాని, కొంతమంది నేతలు దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారని ఆరోపణలు చేశారు.

140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబం అని మోదీ అన్నారు. మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారని తెలిపారు. నేనే మోదీ కుటుంబం అని సభికులతో ప్రధాని  నినాదాలు చేయించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ యువత స్వప్నాలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపామని, కోట్లాది ఎస్సీ యువత స్వప్నాలను సాకారం చేశామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news