అక్టోబర్ 1వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల ఒకటో తారీఖున మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1, 3వ తేదీల్లో రెండు రోజుల విరామంలో రాష్ట్రానికి రెండు సార్లు రానున్న ప్రధాని మోదీ పర్యటనల్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ సిద్ధం చేసింది.

ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ సభల వేదికగా ఎన్నికల సమరభేరి మోగించనున్నారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచార బరిలో దిగనున్నారు. అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌లో, 3వ తేదీన నిజామాబాద్‌లో జరిగే ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌ సభ ఏర్పాట్లను కిషన్‌రెడ్డి స్వయంగా  పరిశీలిస్తుండగా, మహబూబ్‌నగర్‌లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ పర్యవేక్షిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news