వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయంలో మోదీ కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కోడె మొక్కులకు వేములవాడ ఆలయంలో ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. రాజన్నకు కోడె మొక్కులు చెల్లిస్తే కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు అత్యంత విశ్వసించే కోడె మొక్కులను ప్రధాని కూడా చెల్లించుకున్నారు.
స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అ నంతరం ప్రధాని మోదీకి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందించారు. మోదీ ఆలయానికి రావడంతో కాసేపటి వరకు భక్తుల సందర్శనను నిలిపివేశారు. రాజన్న ఆలయ ఆవరణలో భక్తులకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మోదీ వేములవాడ నుంచి బయల్దేరారు. బీజేపీ కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ఆరూరి రమేష్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.