పీవీ పాలనలో భారత్ ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది : ప్రధాని మోదీ

-

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్‌ ( ట్విటర్‌)’ వేదికగా ప్రకటించారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడిన మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ప్రశంసించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందని తెలిపారు.

Prime Minister Modi’s visit to Ellundi AP

“పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసింది’’ అని ప్రధాని మోదీ కొనియాడారు. మరోవైపు మరో మాజీ ప్రధాని చరణ్‌ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news