కడియం ఎమ్మెల్యే కి రాజీనామా చేసి.. గెలిస్తే రాజకీయాల్లోంచి తప్పకుంటా : పోచంపల్లి

-

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వీరిలో కేకే, విజయలక్ష్మి, కడియం శ్రీహరి, కడియం కావ్య బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కడియం శ్రీహరి పై MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు.

కడియం శ్రీహరి చస్తే ఆయన ముగ్గురు కూతుర్లే మోయాలి. కడియం శ్రీహరి లాంటి రాజకీయ దుర్మార్గుడిని నా జీవితంలో చూడలేదు అన్నారు. కూతురు కోసం కడియం ఎంతో మాయ చేశాడు. కూతురు కోసం కడియం శ్రీహరి విలువలు తాకట్టుపెట్టిండు అని తెలిపారు. నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి. నువ్వు మళ్ళీ గెలిస్తే నేను రాజకీయాల నుండి తప్పకుంటానని సవాల్ చేశారు. కడియం కావ్యకు డిపాజిట్ రాకుండా పని చెయ్యాలి బీఆర్ఎస్ కార్యకర్తలకు  MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news