గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తాజాగా కేసు నమోదు అయింది. నకిరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు కావడం జరిగింది.
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిందితులతో సంబంధాలు ఉన్నాయని తమపై కేటీఆర్ ట్వీట్ చేశారంటూ… మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత అలాగే శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. రజిత అలాగే శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై రెండు కేసులు నమోదు చేశారు నకిరేకల్ పోలీసులు.