స్మితా సబర్వాల్ కి షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు

-

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ ప్రచారం విషయంలో ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరూ ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని.. వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రబుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. 

ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టు ఆమె నోటీసులకు కారణమైంది. HCU  కి ఆనుకున్న కొన్ని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. HCU లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు వాటి ముందు నెమలి, జింకను గిబ్లీ శైలీలో ఉన్నట్టు ఆ ఇమేజ్ ఉంది. ఈ పోస్టుని స్మితా సబర్వాల్ రీ ట్వీట్ చేయగా.. ఫేక్ ఇమేజ్ అని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news