తెలంగాణ ఎన్నికలు..గూగుల్ మ్యాప్ లో పోలింగ్ కేంద్రాలు

-

 

Polling centers  : తెలంగాణ ఎన్నికలు మరో 11 రోజుల్లో జరునున్నాయి. అయితే.. ఎన్నికలు వస్తున్న తరుణంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. పోలింగ్ కేంద్రాలను, ఓటర్ల వివరాలను తెలుసుకునే విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సరళతరం చేసింది. తన పోర్టల్ లో పోలింగ్ బూత్ ల వారీగా సమగ్ర అంశాలను అందుబాటులోకి తెచ్చింది.

Polling centers on google map

వెబ్సైట్ లోకి వెళ్లి సాధారణ ఎన్నికలు 2023 ఎలక్ట్రోరల్ రోల్స్ లో జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. దీంతో ఏ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో తెలిపే వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. దాని చెంతనే తెలుగు, ఆంగ్ల భాషల్లో గూగుల్ మ్యాప్ ని నిక్షిప్తం చేశారు. అందులో ఓటరు ప్రారంభ సంఖ్య, చివరి సంఖ్య, పురుషులు, మహిళలు ఎంతమంది ఉన్నారు… ఇలా బూత్ ల వారీగా వివరాలు అందుబాటులో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version