తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పోలీసు, ఇతర శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ప్రలోభాలకు తావు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఇక తాజాగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 13 నియోజకవర్గాలను ఈ తరహాగా గుర్తించినట్లు తెలిపింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వెల్లడించింది. ఈ 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించింది