“శభాష్” షమీ: కట్టుకున్న భార్య మోసం చేసినా వరల్డ్ కప్ లో ఇరగదీస్తున్నాడు !

-

ప్రస్తుతం ప్రపంచ కప్ లో ఇండియా జట్టు వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకువెళుతోంది. ముఖ్యంగా ఇండియా బౌలర్లు ఎప్పుడూ లేని విధంగా ప్రత్యర్థి ప్లేయర్స్ ను వణికిస్తూ తక్కువ స్కోర్ లకే ఆల్ అవుట్ చేస్తూ సునాయాసంగా విజయాలను అందిస్తున్నారు. ఇక గత రెండు మ్యాచ్ ల నుండి వరల్డ్ కప్ లో వచ్చిన అవకాశాన్ని వాడుకోలేక ఫెయిల్ అయిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో షమీ అయిదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్లు సాధించి మరోసారి రాణించాడు. దీనితో ఇతని పై దేశవ్యాప్తంగా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

కాగా షమీ వ్యక్తిగత జీవితంలో తల్లి కట్టిన భార్య తో గొడవలు, విడాకులు, తప్పుడు కేసులతో సతమవుతున్నా అవన్నీ అగ్గిలా నిత్యం తనను కలుస్తున్నా పట్టించుకోకుండా చాలా కమిట్మెంట్ తో ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు షమీ.

Read more RELATED
Recommended to you

Latest news