తెలంగాణ ఓటర్లకు బిగ్ షాక్.. తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ఉండనుంది. మే 13 వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక అటు ఏపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకే పొలింగ్ ఉండడంతో భారీగా తగ్గనుంది పోలింగ్ శాతం.
ఎండ తీవ్రతతో పోలింగ్ పై ప్రభావం ఉంటుంది. తెలంగాణలో కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ పొడగించాలని కోరుతున్నారు రాజకీయ పార్టీల నేతలు,ఎన్జీవోలు, ఓటర్లు. ఏపీ ,తెలంగాణ,మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ పక్క పక్క రాష్ట్రాలు. వాతావరణ పరిస్థితులు అంతట ఓకేలా ఉంటాయి కానీ రెండు సమయాలు వేరు వేరు ఉండడం పట్ల పోలింగ్ తగ్గే అవకాశం ఉంది.