కాంగ్రెస్​తోనే తెలంగాణలో ప్రజాపాలన సాధ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తొమ్మిదన్నరేళ్లలో చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంటే.. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది.

కాంగ్రెస్ అభ్యర్థులంతా తమ ప్రధాన పోకస్ అంతా ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే పెట్టారు. మరోవైపు ముఖ్యనాయకులు ఆరు గ్యారెంటీలు సహా కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

పట్టణంలోని కూరగాయల మార్కెట్​లో పొంగులేటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వ్యాపారులకు వివరిస్తూ చేయి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో ప్రజాపాలన సాధ్యమని.. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పొంగులేటి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news