పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అనుచరులు చితకబాదారు. ఖమ్మం – నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి మంత్రి పువ్వాడ అజయ్ వచ్చారు.
అదే సమయంలో పొంగులేటి అనుచరుడు చీకటి కార్తీక్ జై పొంగులేటి అంటూ నినాదాలు చేశాడు. దీంతో అక్కడే ఉన్న పువ్వాడ అజయ్ అనుచరులు కార్తిక్ ను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కాగా,తెలంగాణ సీఎం కేసీఆర్ కు భయపడి.. పొంగులేటి బీజేపీలోకి వెళుతున్నాడని పొంగులేటి అనుచరుడు మట్ట దయానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మట్ట దయానంద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మట్ట దయానంద్ మాట్లాడుతూ.. టెన్షన్‌లో కేసీఆర్ మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశాడు కానీ ఇప్పుడు భయపడుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిని చితకబాదిన మంత్రి పువ్వాడ అజయ్ అనుచరులు
ఖమ్మం – నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి మంత్రి పువ్వాడ అజయ్ వచ్చిన సమయంలో పొంగులేటి అనుచరుడు చీకటి కార్తీక్ జై పొంగులేటి నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న పువ్వాడ అజయ్… pic.twitter.com/jYAp292OEi
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2023