కేసీఆర్ పై పోటీ చేస్తా.. ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా : పొంగులేటి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని.. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైంది అన్నారు. 


వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీపై తనకు సమాచారం లేదన్నారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. జనాల కోసం పాటుపడే నాయకుడు తుమ్మల అని కొనియాడారు. బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు శాతం ఓట్లు లేని రోజుల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను బీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. కొందరూ కుట్ర పన్ని తనను అపహేళన చేశారని వాపోయారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version