దీపావళికి టపాసుల పేల్చేవారికి బిగ్‌ అలర్ట్.. పొన్నం కీలక ఆదేశాలు

-

దీపావళికి టపాసుల పేల్చేవారికి బిగ్‌ అలర్ట్ ప్రకటించారు.. హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. జనావాస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పొన్నం ప్రభాకర్…. దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరడం జరిగింది.

రాష్ట్రం మొత్తం మరియు జంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న గల్లిల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా గుర్తు చేశారు పొన్నం ప్రభాకర్. ఇప్పటికే హైదారాబాద్ లో అబిడ్స్ తో పాటు యకత్ పుర లోని చంద్ర నగర్ లో టపాసుల దుకాణాలు వల్ల రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి… అదృష్టవశాత్తూ పెద్దగా ప్రమాదం జరగలేదని తెలిపారు పొన్నం ప్రభాకర్. టపాసుల దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ టపాసుల దుకాణాలని మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదారాబాద్ జిల్లా అధికారులను అదేశిస్తున్నట్లు స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version