ponnam prabhakhar vs Hanumakonda ZP Chairman: మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. హనుమకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జడ్పి ఛైర్మెన్ సుధీర్ కుమార్ ల మధ్య వాగ్వాదం జరిగింది. అంబేద్కర్ విగ్రహా విష్కరణ సభలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జడ్పి ఛైర్మెన్ సుధీర్ కుమార్ ల మధ్య రసాభాస చోటు చేసుకుంది.

Hanumakonda ZP Chairman
భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కు వచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే.. హానుమకొండ జడ్పీ చైర్మన్ సుధీరకుమార్ ప్రసంగంలో ప్రభుత్వం పై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. రాజకీయాలు మాట్లాడవద్దని వారించారట మంత్రి పొన్నం. దీంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జడ్పి ఛైర్మెన్ సుధీర్ కుమార్ ల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ తరుణంలోనే.. జడ్పీ చైర్మన్ మైక్ లాక్కున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.