తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని 31 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 81, 455 మంది భక్తులు దర్శించుకున్నారు.వారిలో 31, 251 మంది తలనీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు ముగిసి… విద్యాసంస్థలు ప్రారంభం కానున్న తరుణంలో… తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక అటు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ), రూ.50 లడ్డూ ప్రసాదం ధరల మార్పుపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భక్తులు గందరగోళానికి గురి కావొద్దని.. ఈ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ధరలను సవరించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
- తిరుమల..31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81455 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 31251 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.67 కోట్లు