తెలంగాణ అసెంబ్లీ లో ఇవాళ సివిల్ కోర్టు సవరణ బిల్లు, తెలంగాణ చట్ట సవరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఈ తరుణంలోనే అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్చాలని సభ దృష్టికీ తీసుకొచ్చారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తెలిపారు.
అన్ని పార్టీలు మద్దతు తెలిపితే తాము తప్పకుండా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు తప్పకుండా పెడతామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మరోవైపు బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్ లకు గ్రూపు 1 ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలిపారు. చదువులోనే కాదు.. క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్ ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలిపారు. వచ్చే సమావేశాల్లో క్రీడలపై డిస్కషన్ ఉంటుందని.. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఆటల పోటీలు పెడదామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.