బీఆర్ఎస్ కు అధికారమే లక్ష్యంగా నా పాదయాత్ర కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యపేట పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. ఇవాళ మనకు ఉద్యమం కొత్త కాదు. అధికారం కొత్త కాదు. ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. ఇవాళ అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను, జగదీశ్ రెడ్డి పదేండ్లు మంత్రిగా పని చేశాం.
ఇక్కడున్న వారిలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు.. ఇలా రకరకాల పదవులు వచ్చాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది మన కోసం కాదు.. ప్రజల కోసం. టీఆర్ఎస్ పుట్టుక చరిత్రలో అనివార్య పరిస్థితిలో వచ్చింది. ఇవాళ ఒక వికృతమైన సీఎంను చూస్తున్నారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు. అదృష్టం బాగుంది.. పర్సనాలిటీ పెంచుకుంటడు అనుకున్న రేవంత్ రెడ్డి. 54 ఏండ్లకే జాక్ పాట్ తగిలింది.