నేటి నుంచి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ

-

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అయిదు పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాలి. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల వంటి పది అంశాలను పూరించాలి. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు.

Telangana Govt

ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని దరఖాస్తుకు జత పరచాలి. ఇప్పటికే ఫించను పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇంటి స్థలం కోసం దరఖాస్తు కోసం దరఖాస్తు చేసే ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ నంబరును ప్రస్తావించాలి. దరఖాస్తుల ద్వారా సమాచారం సేకరించి.. దాని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news