నేటి నుంచి ప్రాణ‌హిత న‌ది పుష్క‌రాలు.. రాష్ట్రంలో తొలిసారి

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ రోజు నుంచి ప్రాణ‌హిత న‌ది పుష్క‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు ప్రాణ‌హిత న‌ది పుష్క‌రాలు జ‌రుగుతాయి. గ‌తంలో ప్రాణ‌హిత పుష్క‌రాలు 2010 లో జ‌రిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత రాష్ట్రంలో తొలి సారి ప్రాణ‌హిత పుష్క‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి.. మంచిర్యాల జిల్లాలోని అర్జున గుట్ట పుష్క‌ర్ ఘాట్ వ‌ద్ద మ‌ధ్యాహ్నం 3:50 గంట‌ల‌కు ప్రాణ‌హిత పుష్క‌రాల‌ను ప్రారంభించ‌నున్నారు.

ఈ ప్రాణ‌హిత పుష్క‌రాల‌కు తెలంగాణ‌తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భ‌క్తులు పాల్గొంటారు. ఈ ప్రాణహిత పుష్క‌రాల్లో దాదాపు 2 ల‌క్షల‌కు పైగా భ‌క్తులు స్నానాలు ఆచ‌రిస్తార‌ని అధికారులు అంచ‌నా వేశారు. కాగ ప్రాణ‌హిత పుష్క‌ర ఘాట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాలో.. అర్జున్ గుట్ట‌, వేమ‌నప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో.. కాళేశ్వ‌రం త్రివేణి సంగ‌మం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల‌లో తుమ్మిడి హెట్టి, మ‌హారాష్ట్రలో సిరోంచ‌, న‌గురం వ‌ద్ద పుష్క‌రాలు జ‌ర‌గ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news