ఐపీఎల్ 2022 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. మంగళ వారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డ విషయం తెలిసింది. ఈ మ్యాచ్ లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలిచింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్.. ఆదిలోని ఇబ్బందులను ఎదుర్కొంది. 50 పరుగుల వ్యవధిలోనే ప్రధాన 5 వికెట్లను కోల్పోయింది. మాక్స్ వెల్ (26), సుయష్ ప్రభుదేసాయి (34), దీనిష్ కార్తిక్ (34) తో రాణించారు.
అయిన ఫలితం దక్కలేదు. చెన్నై బౌలర్లు మహేశ్ తీక్షణ 4, కెప్టెన్ జడేజా 3 వికెట్లు తీసి బెంగళూర్ ను చావు దెబ్బ కొట్టారు. అలాగే ముఖేష్ చౌదరీ, డ్వేన్ బ్రావో ఒక్కో వికెట్ తీశారు. దీంతో బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. 23 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓటమిపాలైంది. దీనికి ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై.. రాబిన్ ఉత్తప్ప (88), శివమ్ దూబె (95) తో దుమ్ములేపారు. వీరి దాటికి చెన్నై 216 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శివమ్ దూబెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించారు.